పంజాబ్‌లో లాక్డౌన్ మే 31 వరకు కొనసాగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. లాక్డౌన్ 4.0పై కేంద్రం అధికారిక ప్రకటన జారీ చేయాడానికి ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్‌లో కర్ఫ్యూ మాత్రం ఎత్తివేయనున్నట్లు స్పష్టం చేశారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో మరిన్ని ఆంక్షలను సడలించనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు సింగ్. పరిమిత సంఖ్యలో ప్రజా రవాణా పునురుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.
మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు.. - punjab cm amarinder singh latest news
పంజాబ్‌లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. కర్ఫ్యూ మాత్రం ఎత్తివేయనున్నట్లు చెప్పారు. లాక్డౌన్ 4.0పై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేశాక ఆంక్షల సడలింపుపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు.
![మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు.. Punjab extends lockdown till May 31](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7228748-118-7228748-1589648965388.jpg)
లాక్డౌన్ 4.0కు సంబంధించి కేంద్రం ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం.. ఆంక్షల సడలింపుపై మరింత స్పష్టత ఇస్తామని అమరీందర్ సింగ్ అన్నారు. పేస్బుక్ ఇంటరాక్షన్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు. చాలా నిబంధనలు ఎత్తివేస్తామని, కరోనా కట్టడికి ప్రజలు మరింత సహకరించాలని కోరారు. విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోవని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచవన్నారు.
జోన్ల విభజన అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాని కేంద్రానికి సూచించినట్లు పేర్కొన్నారు సింగ్. జిల్లా మొత్తం ఒకే జోన్‌గా కాకుండా ఉండాలన్నారు. అలా అయితే కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రెడ్జోన్లలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించే వీలుంటుందని అన్నారు. పంజాబ్‌లో కరోనా కేసుల రెట్టింపు సమయం 44 రోజులుగా ఉందని, వైరస్ కట్టడికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.