తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం - పంజాబ్​లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. చట్టాలకు నిరసిస్తూ మూడు బిల్లులను ప్రవేశపెట్టారు.

Punjab: Chief Minister Captain Amarinder Singh moves a resolution on the floor of the state assembly
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

By

Published : Oct 20, 2020, 11:40 AM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. పంజాబ్​ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. దీనికి తోడు మూడు చట్టాలకు కౌంటర్​గా మూడు బిల్లులను ప్రవేశపెట్టారు.

ప్రత్యేక అసెంబ్లీ సెషన్​లో భాగంగా రెండో రోజు ఈ బిల్లులను ప్రవేశపెట్టారు అమరీందర్​ సింగ్​. ఫలితంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా పంజాబ్​ నిలిచింది.

ఈ నేపథ్యంలో కేంద్రంపై మండిపడ్డారు పంజాబ్​ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం వైఖరి వింతగా ఉందన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమన్న విషయాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.

వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గత నెలలో మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్​ ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇవి చట్టాలుగా మారాయి. చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రైతులకు ప్రధాని మోదీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని విపక్షాలు మండిపడ్డాయి.

ఇదీ చూడండి:-అసెంబ్లీలోనే నిద్రించి ఆప్​ ఎమ్మెల్యేల నిరసన

ABOUT THE AUTHOR

...view details