సిద్ధూ రాజీనామాకు ముఖ్యమంత్రి ఆమోదం పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాపై నెలకొన్న వివాదానికి తెరదించారు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించారు. ఆ లేఖను గవర్నర్ వీపీ సింగ్‌కు పంపించారు.
కేవలం ఒకే ఒక్క లైన్లో రాజీనామా సమర్పించారు సిద్ధూ. అందులో ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇదీ జరిగింది...
గత నెల జూన్ 6న పంజాబ్ కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించారు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్ధూ శాఖలను మార్చారు. స్థానిక ప్రభుత్వ విభాగం, పర్యటక-సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉన్న సిద్ధూకు ఇంధన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిత్వ శాఖలను అప్పగించారు. శాఖల మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సిద్ధూ. జూన్ 10న కాంగ్రెస్ అధ్యక్షుడికి రాజీనామా సమర్పించినట్లు జులై 14న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అనంతరం జులై 15న తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.
తనకు అప్పగించిన శాఖలను నిర్వర్తించడానికి సిద్ధూ ఇష్టపడకపోతే తాను చేయగలిగింది ఏమీ లేదని గతవారం దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రక్షణ మంత్రి పర్యటన రోజే పాక్ కాల్పులు