పంజాబ్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను కలిశారు. దీంతో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
''పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడం వల్ల ప్రభుత్వ నిబంధనలు, వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ట్వీట్ చేశారు.