తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయ' బిల్లులను ఆమోదించిన  పంజాబ్ అసెంబ్లీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. భాజపా మినహా విపక్ష పార్టీలన్నీ ఈ బిల్లులకు మద్దతిచ్చాయి.

Punjab Assembly unanimously passes Bills against farm laws
సాగు చట్ట వ్యతిరేక బిల్లులకు పంజాబ్ అసెంబ్లీ ఆమోదం

By

Published : Oct 20, 2020, 5:26 PM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులను పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐదు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వీటికి సభ ఆమోదం తెలిపింది.

విపక్ష పార్టీలు శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, లోక్​ ఇన్సాఫ్ పార్టీల సభ్యులు బిల్లులకు మద్దతిచ్చారు. భాజపా ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు.

వ్యవసాయ ఒప్పందంలో భాగంగా వరి, గోధుమలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులు రూపొందించారు.

"పార్లమెంట్​లో ఈ(సాగు) బిల్లులు చట్టాలుగా మారాయి. కానీ విధాన సభ వీటిని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. మేం తీర్మానాన్ని ఆమోదించుకొని, ఏకతాటిపైకి వచ్చాం. తీర్మాన ప్రతులను గవర్నర్​కు అందించాం, వాటిని ఆమోదించాలని అభ్యర్థించాం."

-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి

బిల్లుల విషయమై మంగళవారం సాయంత్రం పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్​ను సీఎం అమరీందర్ కలిశారు. నాలుగు బిల్లులతో పాటు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం గురించి గవర్నర్​కు వివరించారు. ఆప్ ఎమ్మెల్యే హర్​పాల్ సింగ్ చీమ, శిరోమణి అకాలీదళ్ నేత శరన్​జీత్ సింగ్ ధిల్లాన్ సహా పలువురు నేతలు అమరీందర్​తో కలిసి రాజ్​భవన్​కు వెళ్లారు.

ఇదీ చదవండి-వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details