పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరో రాష్ట్ర ప్రభుత్వం గళం వినిపించింది. సీఏఏ రద్దు చేయాలని కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది.
పంజాబ్ ప్రభుత్వం రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా చివరిరోజైన నేడు.. మంత్రి బ్రహ్మ్ మొహింద్ర ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని ప్రశాంతంగా ఉండే పంజాబ్‌లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయని తీర్మానం సందర్భంగా పంజాబ్ మంత్రి పేర్కొన్నారు. చర్చ అనంతరం తీర్మానం ఆమోదం పొందింది.