తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ గ్రామంలో చైనా ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం

మహారాష్ట్ర పుణె జిల్లాలో ఓ గ్రామంలో చైనా వస్తువులు అమ్మకం, కొనుగోళ్లను నిషేధించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానించారు.

Pune village passes resolution to ban sale, purchase of Chinese products
ఆ గ్రామంలో చైనా ఉత్పత్తుల క్రయ విక్రయాలు నిషేధం!

By

Published : Jun 27, 2020, 10:47 PM IST

గల్వాన్ లోయలో సైనికుల ఘర్షణ కారణంగా చైనాపై భారత్​ ప్రజల్లో కోపాగ్ని రాజుకుంది. ఈ నేపథ్యంలో చైనా వస్తువులు బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చైనా వస్తువులను ధ్వంసం చేశారు. చైనా యాప్​లను నిషేధించాలని నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే మహారాష్ట్ర పుణె జిల్లాలోని కోంఢ్వే-ధావడే గ్రామస్థులు చైనా వస్తువుల అమ్మకం, కొనుగోలు నిషేధించాలని గ్రామ పంచాయితీ సమావేశంలో తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు గ్రామాధికారులు తెలిపారు.

అమ్మకూడదు.. కొనకూడదు..!

చైనా వస్తువులను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ ​సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చైనా ఉత్పత్తులను అమ్మకూడదని ఆ గ్రామంలోని దుకాణదారులను ఆదేశించారు గ్రామాధికారులు. గ్రామస్థులు కూడా చైనా వస్తువులు కొనుగోలు చేయకూడదు.

"ఈ నిర్ణయాన్ని పంచాయతీ సమావేశంలో తీసుకున్నాం. గ్రామ పంచాయతీ కాంట్రాక్టర్లకు ఇదే విషయాన్ని తెలియజేశాం. ఒప్పందంలోనూ ఈ అంశాలను ప్రస్తావించాం. చైనా ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరపకూడదని గ్రామ ప్రజలకు, దుకాణదారులకు సమాచారం అందించాం. బ్యానర్లు, పోస్టర్లు అతికించి ప్రచారం చేస్తున్నాం."

- నితిన్ ధ్వాడే, కోంఢ్వే-ధావడే గ్రామ సర్పంచ్​

ఇదీ చూడండి:భవిష్యత్​ తరాల మార్గదర్శి- సంస్కరణల రుషి 'పీవీ'

ABOUT THE AUTHOR

...view details