తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు కరోనా- దేశంలో తొలి కేసు - దేశంలో తొలిసారి తల్లి నుంచి శిశువుకు కరోనా

దేశంలో తొలిసారి తల్లి నుంచి నవజాత శిశువుకు కరోనా సోకిన కేసు నమోదైంది. పుణెలోని ససూన్ ఆస్పత్రిలో ఈ కేసును గుర్తించారు.

vertical transmission of COVID-19 from mother to daughter
తల్లి నుంచి శిశువుకు కరోనా

By

Published : Jul 28, 2020, 7:47 PM IST

దేశంలో తొలిసారి వర్టికల్ ట్రాన్స్​మిషన్​ కరోనా కేసు మహారాష్ట్ర పుణెలో నమోదైంది. తల్లి నుంచి నవజాత శిశువుకు కరోనా వైరస్ సోకినట్లు ససూన్ జనరల్ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు.

తల్లికి నెగెటివ్ కానీ..

తల్లికి మొదట నిర్వహించిన ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా తేలినట్లు ససూన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. యాంటీ బాడీ పరీక్షలు చేయగా..తల్లిలో కరోనా ఆనవాళ్లు లభించినట్లు వెల్లడించాయి. దీనితో ఆమెకు కరోనా సోకినా.. యాంటీ బాడీలు వైరస్​ను ఎదుర్కొని ఉండొచ్చనే అంచనాకు వచ్చారు వైద్యులు.

వెంటనే నవజాత శిశువు బొడ్డుతాడు, ఇతర అవయవాల నుంచి సేకరించిన శాంపిల్స్​కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలినట్లు వైద్యులు చెప్పారు. శిశువులో తీవ్ర అనారోగ్య సమస్యలు గుర్తించి.. 3 వారాల పాటు ఐసీయూలో చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్లేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆ ప్రాంతాల్లో​ ఆగస్టు 31 వరకు లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details