తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆటోలో 18 కి.మీ ప్రయాణానికి రూ.4,300 బిల్! - driver

ఉపాధి వెతుక్కుంటూ పుణె వచ్చిన బెంగళూరు ఇంజినీర్​కు టోకరా వేశాడు ఓ ఆటో డ్రైవర్​. పద్దెనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి వంద, రెండు వందలు కాదు... ఏకంగా 4,300 రూపాయలు వసూలు చేశాడు.

ఆటోలో 18 కి.మీ ప్రయాణానికి రూ.4,300 బిల్!

By

Published : Sep 21, 2019, 1:12 PM IST

Updated : Oct 1, 2019, 10:56 AM IST

ఉద్యోగం కోసం వచ్చిన ఇంజినీర్​ను బెదిరించి బలవంతంగా 4,300 రూపాయలు వసూలు చేశాడు ఓ ఆటో డ్రైవర్​. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని ఎరవాడలో చోటు చేసుకుంది.

ఇలా జరిగింది

బెంగళూరు చెందిన ఓ ఇంజినీర్... ఉద్యోగం కోసం శుక్రవారం పుణె వచ్చాడు. ఉదయం ఐదు గంటల సమయంలో కాట్రాజ్​-దెహు రహదారిపై బస్సు దిగాడు. అక్కడి నుంచి తాను చేరుకోవాల్సిన ఎరవాడ ప్రాంతానికి ఆటోరిక్షాలో పయనమయ్యాడు.

గమ్యం చేరుకున్నాక

గమ్యస్థానానికి చేరుకున్నాక ఛార్జీ ఎంత అని అడిగిన ఇంజినీర్... ఆటో డ్రైవర్​ చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నాడు. 18 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 4,300 రూపాయలు చెల్లించాలని చెప్పాడు ఆ డ్రైవర్. ఎందుకింత అని అడిగితే... "రూ.1200 టోల్​ ఛార్జీ కలిపితే అంతే" అన్నాడు.

చెల్లించటానికి నిరాకరించగా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. అతనితో పాటు ఆటోలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించారు. నిర్మానుష్య ప్రదేశంలో జరిగిన ఈ ఘటనతో ఇంజినీర్ భయపడ్డాడు. అడిగిన సొమ్ము చెల్లించాడు.

ఆ తరువాత

దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి దర్జాగా వెళ్లిపోయారు ఆ ఆటో డ్రైవర్​ సహా ఇద్దరు వ్యక్తులు. వెంటనే ఆ విద్యార్థి ఆటో​ నెంబర్​ను​ నమోదు చేసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి :మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు

Last Updated : Oct 1, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details