2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). అతడిని 25ఏళ్ల మహమ్మద్ ఇక్బాల్ రాథేర్గా పేర్కొంది.
ఇక్బాల్ జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్వాసి. పుల్వామా ఉగ్ర దాడికి కుట్ర పన్నిన కీలక వ్యక్తి, జైషే మహమ్మద్ సభ్యుడు ముహమ్మద్ ఉమర్ ఫరూక్.. భారత భూభాగంలోకి చొరబడిన అనంతరం.. అతడికి ఇక్బాల్ సహాయం చేశాడని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. పుల్వామా దాడిలో ఉపయోగించిన ఎల్ఈడీని ఇతరులతో కలిసి ఫరూక్ తయారుచేశాడని ఎన్ఐఏ ప్రతినిధి వెల్లడించారు.