జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. పుల్వామాలోని జధోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీటుగా ప్రతిస్పందించిన భద్రతా దళాలు ఎదురుకాల్పులకు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన జరిగిన ప్రాంతంలో గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఉగ్ర ఏరివేత: ఎన్‌కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతం - three militants killed in encounter
పుల్వామాలో ఎన్కౌంటర్
07:55 August 29
07:25 August 29
పుల్వామాలో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం
- జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎదురుకాల్పులు
- భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
- జమ్ముకశ్మీర్: కొనసాగుతున్న గాలింపుచర్యలు
Last Updated : Aug 29, 2020, 9:03 AM IST