తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో పుల్వామా తరహా దాడికి జైషే కుట్ర' - DELHI COURT

భారత్​లో అలజడులు సృష్టించడానికి జైషే ఉగ్రవాది సజ్జద్​ అహ్మద్​ కుట్రపన్నినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దిల్లీకోర్టుకు తెలిపింది. ఆరోపితుడు సజ్జద్​.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదస్సిర్​కు అత్యంత సన్నిహితుడు అని న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఎన్​ఐఏ పేర్కొంది.

'దేశంలో పుల్వామా తరహా దాడికి జైషే కుట్ర'

By

Published : Sep 16, 2019, 10:13 PM IST

Updated : Sep 30, 2019, 9:25 PM IST

దిల్లీ సహా భారత్​లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరపడానికి జైషే మహ్మద్​ ఉగ్రవాది సజ్జద్​ అహ్మద్​ ఖాన్​ ప్రణాళికలు రచించాడని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).

కశ్మీర్​లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మహుతి దాడిలో 40మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సూత్రధారి అయిన ముదస్సిర్​ అహ్మద్​ ఖాన్​కు సజ్జద్​ అత్యంత సన్నిహితుడు. పుల్వామా కుట్రలోనూ సజ్జద్​ హస్తముందని అనుమానాలున్నాయి.

పుల్వామా దాడికి సంబంధించి.. నలుగురు ఉగ్రవాదులపై(సజ్జద్​, తన్వీర్​, బిలాల్​, ముజఫ్ఫర్​) 120-బీ, 121-ఏ సెక్షన్ల కింద ఛార్జ్​షీట్​ దాఖలైంది. మార్చిలో జరిగిన ఎన్​కౌంటర్​లో పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదస్సిర్​ మరణించడం వల్ల అతడి పేరును ఛార్జ్​షీట్​ నుంచి తొలగించారు.

"ఈ నలుగురు ఉగ్రవాదులు పుల్వామాకు చెందిన వారు. తన్వీర్​, బిలాల్​.. పుల్వామా తరహా దాడి చేయాలనుకున్నారు. వీరు సజ్జద్​ సోదరులు, జైషే ఉగ్రవాదులు. వివిధ ఎన్​కౌంటర్లలో వీరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం సజ్జద్​ జైషేలో చేరాడు. దిల్లీ-ఎన్​ఆర్​సీ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి."
-- జాతీయ నిఘా సంస్థ.

దిల్లీ లజ్​పత్​ రాయ్​ మార్కెట్​ సమీపంలో సంచరిస్తూ పోలీసులకు చిక్కాడు సజ్జద్​.

ఇదీ చూడండి:-కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Last Updated : Sep 30, 2019, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details