పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర సైనికులకు నివాళిగా ఈ ఏడాది హోలీ వేడుకలను రద్దు చేసింది సీఆర్పీఎఫ్. వేడుకలను అధికారికంగా నిర్వహించబోమని డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ భట్నాగర్ తెలిపారు.
"సీఆర్పీఎఫ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా 3 లక్షల మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సమర్థంగా, ధైర్యంగా మా విధులను నిర్వర్తిస్తామన్న నమ్మకం ఉంది. వీరమరణం పొందిన వారికి నివాళిగా హోలీ నిర్వహించొద్దని నిర్ణయాన్ని తీసుకున్నాం."- ఆర్ ఆర్ భట్నాగర్, సీఆర్పీఎఫ్ డీజీ