తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వార్డులో మరుగుదొడ్లు కడిగిన ఆరోగ్య మంత్రి! - Puducherry health minister cleans toilet in COVID-19 ward

పుదుచ్చేరిలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావు. కరోనా రోగులు ఉండే ఆసుపత్రిలో పర్యటించిన ఆయన.. చీపురు పట్టి మరుగుదొడ్లు శుభ్రం చేశారు.

Puducherry health minister cleans toilet in COVID-19 ward
కరోనా వార్డులో మరుగుదొడ్లు కడిగిన ఆరోగ్య మంత్రి!

By

Published : Aug 30, 2020, 1:35 PM IST

ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో.. పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు అసలైన లీడర్ అనిపించుకున్నారు. ఓ ఆసుపత్రిలోని కరోనా వార్డులో మరుగుదొడ్లు శుభ్రం చేశారు.

పుదుచ్చేరి ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పర్యటించారు మంత్రి కృష్ణారావు. బాధితులను పరామర్శించిన ఆయన.. వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. దవాఖానాలో మరుగు దొడ్లు శుభ్రంగా లేవనే ఫిర్యాదుల రావడం వల్ల ఆయనే స్వయంగా చీపురు పట్టారు. బ్రష్​తో మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఇకనైనా పారిశుద్ధ్య కార్మికుల సాయంతో పరిసరాలు క్లీన్​ చేయించాలని యాజమాన్యాన్ని మందలించారు.

మరుగుదొడ్లు ఉపయోగించాక నీళ్లతో శుభ్రం చేసేయాలని.. ఎవరో వచ్చి క్లీన్​ చేస్తారని వేచి చూడొద్దని కరోనా బాధితులకు మంత్రి సూచనలు చేశారు.

"కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు కలిపి మొత్తం 458 మంది ఆరోగ్య కార్యకర్తలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30న 80 మంది నర్సులు ఉద్యోగంలో చేరనున్నారు. "

- మల్లాడి కృష్ణా రావు, పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి

ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!

ABOUT THE AUTHOR

...view details