తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి! - కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి

మైనర్​ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడికి న్యాయస్థానం ఆవరణలోనే బుద్ధి చెప్పారు ప్రజలు. పోలీసుల అదుపులో కోర్టుకు హాజరైన నిందితుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలో చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను అరెస్ట్​ చేశారు పోలీసులు.

Publics brutally beats the man who raped minor girl   Belagavi: Publics brutally beats the man who raped minor girl in the court ground
కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి!

By

Published : Dec 13, 2019, 9:27 AM IST

Updated : Dec 13, 2019, 12:26 PM IST

కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి!

కర్ణాటక బెళగావిలో మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి కోర్టు ఆవరణలోనే దేహశుద్ధి చేశారు స్థానికులు.

26 ఏళ్ల సునీల్​ బాలనాయిక అనే వ్యక్తి.. బెళగావి జిల్లాలోని కడోలీ ప్రాంతంలో ఓ మైనర్ ​బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే న్యాయస్థానం ఎదుట బాలిక బంధువులు, నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. కోర్టు నుంచి బయటికి తీసుకువచ్చే సమయంలో ఒక్కసారిగా పోలీసులను దాటి సునీల్​పై దాడి చేశారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు దాడి చేసిన వారిలో కొందరిని అరెస్ట్​ చేశారు పోలీసు. కామాంధుడిని దండిస్తే అరెస్ట్​ చేయడం ఏమిటంటూ.. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు నిరసనకారులు. రాస్తారోకో చేసి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'గడ్డం గ్యాంగ్' సేవ గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!

Last Updated : Dec 13, 2019, 12:26 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details