'ప్రభుత్వ స్థలాలను నిరవధికంగా ఆక్రమించుకోరాదు'
షాహిన్‌బాగ్ లాంటి ప్రభుత్వ స్థలాలను నిరసనల కోసం ఆక్రమించుకోవడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అలాంటి ప్రదేశాలను నిరవధికంగా ఆక్రమించుకోరాదని సూచించింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్లో జరిగిన నిరసనల్లో దిల్లీలోని షాహిన్‌బాగ్ ప్రాంతాన్ని ఉపయోగించుకున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరసనల సందర్భంగా రహదారులను ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.