తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్​జీ ఆడుతూ పిల్లాడు పరార్ - PUBG

పబ్​జీ ఆట ఆడుతూ ఓ పదోతరగతి విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన దిల్లీలోని ఘజియాబాద్​ పటేల్​ నగర్​లో జరిగింది. తన కుమారుడు పబ్​జీ ఆడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఈ నెల 11న తండ్రి రాజేశ్​ జయంత్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పబ్​జీ ఆడుతూ పిల్లాడు పరార్

By

Published : Mar 20, 2019, 5:22 AM IST

Updated : Mar 20, 2019, 6:31 AM IST

పబ్​జీ ఆడుతూ పిల్లాడు పరార్
పబ్​జీ ఆట గురించి తెలియని వారుండరు. దీనికున్న క్రేజే వేరు. ప్రస్తుతం ఈ ఆన్​లైన్​ ఆట చిన్నాపెద్దా తేడా లేకుండా ఆడే వారందర్నీ బానిసలను చేస్తోంది. ఇటీవల పబ్​జీ ఆడుతూ ఆత్మహత్యలకు పాల్పడటం, ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవటం వంటి వార్తలు ఎక్కువైపోయాయి. ఇటువంటి ఘటనే దిల్లీ ఘజియాబాద్​లోని సిహాని గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పబ్​జీ ఆటకు బానిసగా మారిన ఓ పదోతరగతి విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

పటేల్​ నగర్​కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు అభినవ్​ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న తన కుమారుడు పబ్​జీ ఆడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతని తండ్రి రాజేశ్​ జయంత్​ పోలీసులను ఆశ్రయించాడు.

" మా కుమారుడు పబ్​జీ ఆడేవాడు. ఇది ఓ వినూత్నమైన ఆట. ఈ ఆట ఆడే మా అబ్బాయి ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పబ్​జీ నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. "

రాజేశ్​ జయంత్​, అభినవ్​ తండ్రి.

పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అతనికి చెందిన వస్తువులను, ల్యాప్​టాప్​ను పరిశీలించారు. అభినవ్​ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

" సిహానీ గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల కుర్రాడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడు పబ్​జీ ఆడతాడని మా దర్యాప్తులో తేలింది. ఇంటి నుంచి వెళ్లేముందు ఫోను తీసుకెళ్లినట్లు తెలిసింది. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. "

-కుమార్​, ఘజియాబాద్​ జిల్లా ఎస్పీ.

పబ్​జీ ఆటను ఓ వ్యసనంగా పేర్కొంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఆటపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్​జీ ఆటను దేశవ్యాప్తంగా నిషేధించాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు.

ప్రస్తుతం గుజరాత్​లో ఈ ఆటపై నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే పబ్​జీ ఆడుతూ కనిపించిన చాలా మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Last Updated : Mar 20, 2019, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details