కర్ణాటక ఉడిపిలో ప్రమాద వశాత్తు బావిలో పడిపోయిన ఓ బామ్మ ప్రాణాలు కాపాడారు ముగ్గురు సాహస వీరులు.
కాలు జారి బావిలో పడిపోయిన బామ్మ సాయం కోసం ఆర్జించింది. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో బావిలో విలవిల్లాడుతున్న బామ్మను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది వినాయక తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, ఒక్కడే బామ్మను బయటికి తీసే వీలు కాలేదు.
బావిలో పడిన బామ్మను కాపాపడిన సాహసవీరులు ! ఎస్ఐ సదాశివ రాఘవరోజి కూడా బావిలోకి దిగారు. అమెకు ధైర్య చెప్పారు. వినాయక, సదాశివ ఆమె ప్రాణాలు కాపాడేందుకు చేస్తున్న కృషిని స్థానిక ఆటో డ్రైవర్ రాజేశ్ నాయక్ గమనించాడు. ఆయన సైతం బావిలోకి దిగి తనవంతు సాయం అందించాడు.
ఇలా ఆ ముగ్గురు సాహసంతో చాకచక్యంగా బామ్మను బయటకి తీసుకొచ్చారు. మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో వీరికి ప్రశంసలు వెల్లువెత్తుతాయి.
ఇదీ చదవండి: మద్యం వాహనం బోల్తా.. అందినకాడికి ఎత్తుకెళ్లిన స్థానికులు