దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్లోని పలు ప్రాంతాల్లో వరుసగా ఐదో రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హసీర్హాట్లో పౌర చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు నిరసనకారులు. ఆందోళనల కారణంగా ఉత్తర బంగాల్ రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బంగాల్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర నిఘా ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 354 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.
మమత ర్యాలీ..
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జాదవ్పుర్ 8బి బస్టాండ్ నుంచి భవానిపుర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు బంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. విధ్వంస చర్యలకు పాల్పడొద్దని నిరసనకారులకు సూచించారు. నిన్న కూడా కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు మమత.
గువాహటిలో కర్ఫ్యూ ఎత్తివేత..