తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు - protests against amended citizenship act

బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనబాట పట్టారు ఆందోళనకారులు. రోడ్లను దిగ్బంధించి రైల్​రోకోలకు పిలుపునిచ్చారు. మరోవైపు అసోం గువాహటిలో కర్ఫ్యూను ఉదయం వేళ సడలించినట్లు అధికారులు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

bengal protests
బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు

By

Published : Dec 16, 2019, 11:04 AM IST

Updated : Dec 16, 2019, 2:47 PM IST

బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్‌లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు నిరసనకారులు. రైల్ రోకోలతో కదం తొక్కుతున్నారు. తెల్లవారుజాము నుంచే తూర్పు మిడ్నాపూర్, ముషిరాబాద్‌ జిల్లాల్లో పలు రైళ్ల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో పలు రైళ్లను తూర్పు రైల్వే రద్దు చేసింది. రైల్వే భద్రత దృష్ట్యా పట్టాలపై గుమిగూడిన నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు అసత్య వార్తల ప్రచారాన్ని అరికట్టేందుకు బంగాల్‌ల్లోని 6 జిల్లాల్లో అంతర్జాల సేవలపై విధించిన నిషేధం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గువాహటిలో కర్ఫ్యూ సడలింపు

గువాహటిలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించినట్లు అధికారులు తెలిపారు. వారం రోజులుగా చెలరేగిన నిరసనలు తగ్గుముఖం పట్టి.. శాంతియుత పరిస్థితులు నెలకొన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాత్రివేళ మాత్రం కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పరిస్థితులు మెరుగుపడినందువల్లే గువాహటిలో కర్ఫ్యూ సడలించినట్లు అసోం అదనపు డీజీపీ జీపీ సింగ్​ ట్వీట్ చేశారు. కర్ఫ్యూ సడలింపుపై ప్రజలకు లౌడ్​స్పీకర్ల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: ప్రశాంతంగా ఝార్ఖండ్​ నాలుగో విడత పోలింగ్​

Last Updated : Dec 16, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details