తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైదానంలో ఉల్లిగడ్డలు పండిస్తూ రైతుల నిరసన

దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు వినూత్న రూపం సంతరించుకుంటున్నాయి. నిరంకారీ మైదానంలో ఉల్లి సాగు చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు అన్నదాతలు. మరిన్ని పంటలు పండిస్తామని చెబుతున్నారు. మరోవైపు.. సింఘు, టిక్రీ, గాజీపుర్, చిల్లా సరిహద్దుల వద్ద బైఠాయించారు.

FARMERS PROTEST IN DELHI CONTINUES
ఉల్లిగడ్డలు పండిస్తూ రైతుల నిరసన

By

Published : Dec 27, 2020, 12:34 PM IST

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తోన్న అన్నదాతలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు. దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన 32వ రోజుకు చేరగా అటు, రైతు సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దిల్లీలోని నిరంకారీ మైదానంలో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. వీటిని తమ రోజువారీ వంట కార్యక్రమాలకు ఉపయోగిస్తామని వారు తెలిపారు. మైదానంలో మరిన్ని పంటలు పండిస్తామని వెల్లడించారు. చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఉల్లి మొక్కలకు నీరు పడుతున్న రైతులు
ఉల్లి పండిస్తున్న అన్నదాతలు

చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సింఘు, టిక్రీ, గాజీపూర్‌, చిల్లా సరిహద్దుల వద్ద రైతులు బైఠాయించారు. ఈ నెల 30న దిల్లీ-జయపుర హైవేపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

మరోవైపు, కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు అంగీకారం తెలిపిన రైతులు... 4 అంశాలతో చర్చల అజెండాను ప్రతిపాదించారు.

ఇదీ చదవండి:కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం.. కానీ!

ABOUT THE AUTHOR

...view details