తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్'​ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం - unnao victim's house

ఉన్నావ్​ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. నేరస్థులకు సత్వర శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. మరో వైపు​ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందు వెళ్లిన భాజపా మంత్రులు, ఎంపీలను నిరసనకారులు అడ్డుకున్నారు.

Protesters heckle BJP ministers, MP at Unnao rape victim's village in uttarpradesh
'ఉన్నావ్'​ బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం

By

Published : Dec 7, 2019, 8:40 PM IST

Updated : Dec 7, 2019, 11:53 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో కామాంధుల రాక్షసత్వానికి 90 శాతం దహనమై.. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చనిపోయిన బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది యూపీ ప్రభుత్వం.

బాధితురాలికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ భరోసా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

హోరెత్తిన నిరసనలు..

'ఉన్నావ్'​ బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం

ఆడపిల్లలను కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు భగ్గుమన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన భాజపా మంత్రులు, లోక్​సభ సభ్యులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్​ మౌర్య, కమల్​ రాణి వరుణ్​, భాజపా ఎంపీ సాక్షి మహారాజ్​... ఉన్నావ్​లోని బాధితురాలి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఇంటి బయట నిరసనలతో కిక్కిరిసిన విద్యార్థులు, ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వారిని అడ్డుకున్నారు.

'వెనక్కి వెళ్లిపోండి' అంటూ సుమారు 15 నిమిషాల పాటు నినదించారు. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో భాజపా నాయకులు సహా స్థానిక కాంగ్రెస్ నాయకులకూ గాయాలయ్యాయి.​ ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి మంత్రులను, ఎంపీని బాధితురాలి ఇంటికి చేర్చారు.

ఇదీ చదవండి:మహిళా భద్రత... ఈ 'మ్యాప్​' ఉంటే ప్రమాదం లేనట్టే!

Last Updated : Dec 7, 2019, 11:53 PM IST

ABOUT THE AUTHOR

...view details