తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ: నిరసనలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ - Protest in northeast Delhi against amended citizenship law

Protest in northeast Delhi against amended citizenship law
'పౌర' సెగ: దిల్లీలో మరోసారి హింసాయుత నిరసన

By

Published : Dec 17, 2019, 3:18 PM IST

Updated : Dec 17, 2019, 9:43 PM IST

ఆందోళనలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ

18:20 December 17

'పౌర' సెగ: ఆందోళనలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దిల్లీ అట్టుడుకుతోంది. దేశ రాజధానిలోని శీలంపుర్​లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన హింసాయుతంగా మారింది. రాళ్ల దాడి.. బాష్పవాయుగోళాల ప్రయోగంతో ఈశాన్య దిల్లీ హోరెత్తింది. ఈ ఘర్షణలో పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా.. పలువురు పోలీసులు, ఆందోళనకారులు గాయాలపాలయ్యారు.

'పౌర' చట్ట సవరణకు వ్యతిరేకంగా మంగళవారం ఈశాన్య దిల్లీలో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. శీలంపుర్​, జఫ్రాబాద్​ ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. మధ్యాహ్నం 12గంటల సమయంలో శీలంపుర్ నుంచి నిరసనకారులు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. 'పౌర' చట్టం, ఎన్ఆర్​సీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జఫ్రాబాద్ ప్రాంతంలోనూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. 

రాళ్ల దాడి.. బాష్పవాయుగోళాల ప్రయోగం.

పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల దాడికి దిగారు ఆందోళనకారులు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు పోలీసులు. అనంతరం ఆందోళనకారులను ఘటనాస్థలం నుంచి పంపించారు. 

"ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ఉద్రిక్త వాతావరణాన్ని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకే బాష్పవాయుగోళాలను ప్రయోగించాం. ఆందోళనకారుల దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. రెండు ఆర్టీసీ బస్సులు, కొన్ని పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి."
- అలోక్ కుమార్, దిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్.

ఘర్షణల దృష్ట్యా శీలంపుర్​ ప్రాంతంలోని మెట్రో స్టేషన్లను అధికారులు కొద్దిసేపు మూసివేశారు.  

17:05 December 17

సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు

సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, పోలీసుల వైఖరిపై సోనియాగాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు రాష్ట్రపతిని కలిశారు. 
జామియా వర్సిటీలో పోలీసుల దాడిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సోనియా వెంట ఆజాద్,డి.రాజా,ఏచూరి,రామ్‌గోపాల్ యాదవ్,డెరెక్‌ ఓబ్రెయిన్ ఉన్నారు.

16:05 December 17

సంఘటనా స్థలం నుంచి పంపేందుకు..

జఫ్రాబాద్​లో ఆందోళనకారులను సంఘటనా స్థలం నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తునారు. ఇప్పటికే  బాష్పవాయుగోళాలను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

15:49 December 17

డ్రోన్ కెమెరాలతో పరిశీలన

      జఫ్రాబాద్​లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిశీలించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాను వినియోగిస్తున్నారు.

15:21 December 17

జఫ్రాబాద్​లో ఉద్రిక్తత

జఫ్రాబాద్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వుతున్నారు. ఈ ఘర్షణ నేపధ్యంలో రెండు బస్సులు ధ్వంసం అయ్యాయి.

15:10 December 17

'పౌర' సెగ: దిల్లీలో మరోసారి హింసాయుత నిరసన

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాయుతం అయ్యాయి. శీలంపుర్​లో ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగగా... పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

ఇలా మొదలు...

మధ్యాహ్నం 12గంటలకు శీలంపుర్ టి-పాయింట్ వద్దకు వందలాది మంది చేరుకుని నిరసన తెలిపారు. 'పౌర' చట్టం, ఎన్ఆర్సీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఘర్షణలు మొదలయ్యాయి.

మెట్రో బంద్​...

ఘర్షణల దృష్ట్యా శీలంపుర్​ ప్రాంతంలోని 3 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. 

Last Updated : Dec 17, 2019, 9:43 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details