రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రణాళికలను భారతీయ రైల్వే బుధవారం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ మేరకు 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్ల రాకపోకల కోసం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించినట్టు ప్రకటించింది. ఈ మేరకు 109 మార్గాల్లో ప్యాసింజర్ రైళ్ల రాకపోకల కోసం ఆర్ఎఫ్క్యూ(రిక్వెస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్)ను అందివ్వాలని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో ప్రైవేటు సంస్థలు రూ.30వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది.
109 రూట్లలో ఇక ప్రైవేట్ రైళ్ల పరుగులు! - రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులు
రైల్వేలో ప్రైవేటు సంస్థలు రూ. 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. ఒక సారి కార్యకలాపాలు మొదలయ్యాక.. రైళ్ల నిర్వహణ సహా ఇతర ఖర్చులు ప్రైవేటు సంస్థలే భరించాలని స్పష్టం చేసింది.
రైల్వేలో రూ.30వేల కోట్లకుపైగా ప్రైవేటు పెట్టుబడులు
అయితే ఈ కార్యకలాపాల కోసం ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థలే.. రైళ్ల ఆర్థిక, నిర్వహణ ఖర్చులు భరించాలని స్పష్టం చేసింది భారతీయ రైల్వే. వీటితో పాటు రైళ్లను నడపడానికి అవసరమయ్యే వాణిజ్య ఛార్జీలు, ఇంధనం, విద్యుత్ వంటి ఛార్జీలనూ ప్రైవేటు సంస్థలే చెల్లించాలని వెల్లడించింది.
ఇదీ చూడండి:-177 బోగీలతో సూపర్ అనకొండ రైలు
Last Updated : Jul 1, 2020, 8:23 PM IST