తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ములో సాధారణ స్థితికి జనజీవనం - సెక్షన్​144 ఎత్తివేత

జమ్ముకశ్మీర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జమ్ము పరిధిలోని ఐదు జిల్లాల్లో 144 సెక్షన్ ఎత్తివేశారు అధికారులు. దోద, క్రష్టావర్ జిల్లాల్లో కర్ఫ్యూను తొలగించారు. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి.

జమ్ము పరిధిలోని 5 జిల్లాల్లో 144 సెక్షన్​ తొలగింపు

By

Published : Aug 10, 2019, 2:03 PM IST

జమ్ము పరిధిలోని 5 జిల్లాల్లో 144 సెక్షన్​ తొలగింపు

ఆపరేషన్​ కశ్మీర్​ నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలిస్తున్నారు అధికారులు. జమ్ముకశ్మీర్​లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కశ్మీర్​లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతించిన అధికారులు ఈ రోజు జమ్ము పరిధిలోని 5 జిల్లాల్లో 144 సెక్షన్​ ఎత్తివేశారు. దోద, క్రష్టావర్​ జిల్లాల్లో కర్ఫ్యూను తొలగించారు.

జమ్ము, కథువా, సాంబ, ఉధంపుర్‌, రెహ్‌సాయ్‌ జిల్లాల్లో ఈ రోజు పాఠశాలలు, కళాశాలలు, తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఆగస్టు 5 నుంచి ఈ ప్రాంతంలో ఏ విధమైన నిరసనలు ఆందోళనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు.

వాణిజ్యసముదాయాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై వాహన రద్దీ క్రమంగా పెరుగుతోంది. ప్రజలు వారి నిత్యావసరాలను తీర్చుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. పూంచ్‌, రాజౌరీ, రాంబన్ జిల్లాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఊరూరా పంద్రాగస్టు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details