కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ సర్కార్ నవీన భారత రూపకల్పన వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం 10 సూత్రాల ప్రణాళిక రచించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 2014-15తో పోలిస్తే ఆహార భద్రతకు రెట్టింపు నిధులు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు' - Nirmala sitharaman
మోదీ సర్కారు నవీన భారత నిర్మాణం దిశగా అడుగులేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం 10 సూత్రాల ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు.

బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
సామాజిక మౌలిక సదుపాయాల నిర్మాణం, ఆర్థిక రంగంలోని ప్రతి విభాగానికి డిజిటల్ ఇండియా సేవలు, కాలుష్యరహిత భారత్, మేక్ ఇన్ ఇండియా , ఎంఎస్ఎంఈ కోసం ప్రత్యేక చెల్లింపు విధానాలు,అంకుర సంస్థలు, రక్షణ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, నీరు, నీటి సంరక్షణ, నదుల శుద్ధి, అంతరిక్ష ప్రయోగాలు, ఆహార రంగాలు, ఆయుష్మాన్ భారత్, మహిళలు, చిన్న పిల్లల భద్రత వంటి వాటితో పాటు మౌలిక వనరులు, రవాణా వ్యవస్థలకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు నిర్మలా సీతారామన్.
Last Updated : Jul 5, 2019, 12:25 PM IST