తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌర చట్టానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీ, కోల్​​కతా, చెన్నైలో నిరసనలు జరిగాయి. తిరువనంతపురంలో సీఏఏ అనుకూలకంగా ప్రదర్శనలు చేశారు ఏబీవీపీ నేతలు. ప్రజల్లో ఈ చట్టంపై విపక్షాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

Pro and anti-civil protests
పౌర చట్టానికి అనుకూల, వ్యతిరేక నిరసనలు

By

Published : Jan 10, 2020, 6:41 PM IST

వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఉన్న పౌరచట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత దిల్లీ జామ మసీద్‌ వద్ద ర్యాలీ జరిగింది. పౌరచట్టాన్ని, ఎన్ఆర్​సీని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించటంతోపాటు నినాదాలు చేశారు. కోల్‌కతాలోనూ సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన జరిగింది. చెన్నైలోనూ పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాయి.

పౌర చట్టానికి అనుకూల, వ్యతిరేక నిరసనలు

మరోవైపు....పౌరచట్టం, ఎన్​ఆర్​సీకి అనుకూలంగా తిరువనంతపురంలో ర్యాలీ నిర్వహించారు అఖిల భారత విద్యార్థి పరిషత్​ కార్యకర్తలు, నేతలు. ప్రతిపక్షాలు.. ప్రజల్లో లేనిపోని భయాలు రేపుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి:జేఎన్​యూ: విలువల నిలయంలో ఎందుకీ వరుస వివాదాలు?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details