తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ పోలీసులపై సీఆర్​పీఎఫ్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు - 'నా భద్రతా సిబ్బందిని బెదరించారు'-ప్రియాంక

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సిబ్బందిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీస్​లు​ బెదిరించినట్లు ఆరోపించింది పార్టీ కార్యాలయం. ఈ మేరకు సీఆర్​పీఎఫ్​ వీఐపీ భద్రతా అధికారికి లేఖ రాసింది.

priyanka crpf
'నా భద్రతా సిబ్బందిని బెదరించారు'-ప్రియాంక

By

Published : Dec 29, 2019, 6:01 AM IST

Updated : Dec 29, 2019, 6:27 AM IST

అనేక నాటకీయ పరిణామాల మధ్య లఖ్​నవూలో విశ్రాంత ఐపీఎస్​ అధికారి ఎస్ఆర్​ దారాపురి నివాసానికి చేరుకున్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అనంతరం అక్కడ హజ్రద్గంజ్​కు చెందిన అభయ్​ మిశ్రా అనే పోలీస్​ అధికారి తన భద్రతా సిబ్బందిని బెదిరించిన్నట్లు ఆరోపించారు ప్రియాంక. తనను ఎటు వెళ్లనివ్వకుండా నిర్బంధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఆర్​పీఎఫ్​ వీఐపీ భద్రతా అధికారికి లేఖ రాసింది ప్రియాంక అధికారిక కార్యాలయం. మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. ప్రోటోకాల్​ను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

"ఉదయం 8.45గంటలకు హజ్రత్గంజ్​లో అభయ్​ మిశ్రా దాదాపు 12మంది సిబ్బందితో ప్రియాంక గాంధీ ఉన్న ప్రదేశానికి అనుమతి లేకుండా వచ్చారు. అనంతరం ప్రియాంక షెడ్యూల్​ను ఓ రోజు ముందే తమకి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయమని, ప్రియాంకను తన ప్రాంగణం దాటి రెండు అడుగులు కూడా వేయనివ్వమని బెదిరించారు. మరొకసారి ఇలా జరుగకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఆ పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలి. పౌరులకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది, చట్టాన్ని మీరు కాపాడలి."

-ప్రియాంక గాంధీ కార్యాలయం.

ప్రియాంక గాంధీ గదికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న సీఆర్​పిఎఫ్​ సిబ్బందితోనూ అభయ్​ మిశ్రా వాగ్వివాదానికి దిగినట్లు తెలిపింది ప్రియాంక కార్యాలయం.

ఇదీ చూడండి : పోలీసులు నా మెడ పట్టుకుని కింద పడేశారు: ప్రియాంక

Last Updated : Dec 29, 2019, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details