కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో ఏడాదిలో 359 రోజులపాటు సెక్షన్ 144 విధించారని.. మోదీ మాత్రం ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"2019లో 359 రోజులపాటు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సెక్షన్ 144 విధించారు. మరోవైపు ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరంలేదని మోదీ చెబుతున్నారు?"- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ట్వీట్