తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసుల ఈవ్​ టీజింగ్​పై ప్రియాంక ఆగ్రహం

ఈవ్​ టీజింగ్​పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. కాపాడాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల రక్షణ మాటేంటి అంటూ ప్రశ్నించారు.

By

Published : Jul 25, 2019, 5:32 PM IST

పోలీసుల ఈవ్​ టీజింగ్​పై ప్రియాంక స్పందన

ఉత్తరప్రదేశ్​ కాన్పుర్​లోని నజీరాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఓ మహిళ ఈవ్​ టీజింగ్​పై ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. మహిళ అభ్యర్థనను వినిపించుకోకుండా ఆమె ధరించిన ఆభరణాలు, ఆహార్యం గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.

మహిళలపై పోలీసుల అనుచిత ప్రవర్తన

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చినవారు చెప్పింది వినడం పోలీసుల కనీస బాధ్యత అని ప్రియాంక అన్నారు. ఒకవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతుంటే, మరోవైపు వారిని కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రియాంక ఘాటుగా ట్వీట్‌ చేశారు.
యూపీలో గత కొంత కాలంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ సర్కారును తీవ్రంగా విమర్శించారు ప్రియాంక. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details