తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులు నా మెడ పట్టుకుని కింద పడేశారు: ప్రియాంక - ip police latest news

అనేక నాటకీయ పరిణామాల మధ్య లఖ్​నవూలో విశ్రాంత ఐపీఎస్​ అధికారి ఎస్ ఆర్​ దారాపురి నివాసానికి చేరుకున్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మార్గమధ్యలో పోలీసులు ప్రియాంకను అడ్డుకున్నారు. అయితే ఓ మహిళా పోలీసు తన మెడపట్టుకున్నారని ప్రియాంక ఆరోపించారు. నడిరోడ్డుపై తన వాహనాన్ని ఆపిన యూపీ పోలీసుల తీరుపై ప్రియాంక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Priyanka
పోలీసులు నా మెడ పడ్డుకుని కింద పడేశారు: ప్రియాంక

By

Published : Dec 28, 2019, 9:43 PM IST

పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో అరెస్టయిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్ ఆర్ దారాపురి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య దారాపురి నివాసానికి చేరుకున్నారు ప్రియాంక. మార్గమధ్యలో పోలీసుల పలు మార్లు తనను అడ్డుకున్నారని ప్రియాంక తెలిపారు. మహిళా పోలీసులు తన మెడపట్టుకుని నెట్టితే కిందపడిపోయినట్లు ప్రియాంక చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణం వల్ల తన వాహనాన్ని నడిరోడ్డుపై నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న ప్రియాంక

" నా కార్యక్రమం ముగించుకుని ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా దారాపురి నివాసానికి వాహనంలో బయలుదేరాను. మార్గమధ్యలో పోలీసులు మా వాహనాన్ని వెంబడించి నిలిపివేశారు. మమ్మల్ని వెళ్లొద్దన్నారు. ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని మేం అడిగాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోకుండా అడ్డుకోవటమేంటని ప్రశ్నించాం. వెళ్లనివ్వబోమని పోలీసులు అన్నారు. వాహనాన్ని ఆపితే కాలినడకన వెళ్తానని చెప్పాను. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాను. మహిళా పోలీసు నా మెడ పట్టుకున్నారు. మరో మహిళా పోలీసు నన్ను నెట్టితే కిందపడిపోయా. అయినా నేను ఆగకుండా ముందుకుసాగా. నన్ను మళ్లీ అడ్డుకున్నారు. ఆ తర్వాత మా కార్యకర్త ద్విచక్ర వాహనంపై వెళ్లా. పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకుని కాలినడకన నేను ఇక్కడికి చేరుకున్నాను."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

హైడ్రామా

ప్రియాంక వాహనాన్ని పోలీసులు అడ్డుకున్న అనంతరం ఆమె కాలినడకన దారాపురి నివాసానికి బయలుదేరారు. ఒక కిలోమీటరు మేర నడిచారు. అనంతరం తన వాహనంలోకి మళ్లీ ఎక్కగా.. పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. వెంటనే ఆమె పోలీసుల నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న గల్లీలోకి వెళ్లి మూడు కి.మీ మేర నడిచినట్లు యూపీ కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అశోక్​ సింగ్ తెలిపారు. ఆ సమయంలో ప్రియాంక ఆచూకీని పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకోలేక కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details