తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గ్యాంగ్​స్టర్​ వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి'

కాన్పుర్​ ఎన్​కౌంటర్​ ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్​ దూబే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. ఈ కేసులో యూపీ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.

Priyanka Gandhi Vadra seeks CBI probe in gangster Vikas Dubey's case
'గ్యాంగ్​స్టర్​ వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి'

By

Published : Jul 9, 2020, 1:33 PM IST

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే వ్యవహారంపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా వికాస్​ అరెస్టుపై స్పందించారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ వాద్రా. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించి.. వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.

కాన్పుర్​ ఎన్​కౌంటర్​ ఘటనలో యూపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ప్రియాంక. 8 మంది పోలీసులను బలిగొన్న నిందితులను తక్షణమే పట్టుకోలేకపోయారని విమర్శించారు.

ప్రియాంక గాంధీ ట్వీట్​

''పటిష్ట భద్రత ఉన్నప్పటికీ.. నేరస్థుడు ఉజ్జయిన్​ ఎలా చేరుకున్నాడు. ఇది భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు దాగున్నాయి. ''

- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్​ నేత

వికాస్​ను పట్టుకున్నారో.. అతడే లొంగిపోయాడో స్పష్టతనివ్వాలని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ డిమాండ్​ చేశారు. అతని కాల్​ డేటా బయటకుతీయాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ట్వీట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details