దిల్లీ లోధిలోని 35వ నంబర్ ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. జులై 31 లోపే ఖాళీ చేయనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. హరియాణా గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ అరాలియా సెక్టార్ 42లోని ఇంటిలోకి మారుతున్నట్లు చెప్పాయి. కొన్ని నెలలపాటు అక్కడే ఉంటారని వెల్లడించాయి.
అయితే.. ముందు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు ప్రియాంక మకాం మార్చుతారని అంతా అనుకున్నారు. కానీ.. హరియాణా గురుగ్రామ్‌లోని ఇంటికి మారుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అప్పటి వరకు అక్కడే..
ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో 2-3 ప్రాంతాల్లో అద్దె భవనాలను చూశారని.. త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు సన్నిహితులు. అందులో సుజాన్ సింగ్ పార్క్ సమీపంలోని ఓ ఇంటిని ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని, దానికి మూడు నెలల వరకు సమయం పడుతుండగా.. అప్పటి వరకు గురుగ్రామ్‌లో ఉంటారని స్పష్టం చేశారు.