సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్ జిల్లా దిబ్దిబా గ్రామంలో అతని కుటుంబం ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరయ్యారు. నవ్రీత్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రియాంక.
మృతి చెందిన రైతు కుటుంబాన్ని కలిసిన ప్రియాంక సంతాప సభలో పాల్గొన్న ప్రియాంక ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ లల్లు, పలువురు పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.
భాజపా నేత కారును ఢీకొన్న ప్రియాంక కాన్వాయ్
అంతకుముందు.. ప్రియాంక వాహనశ్రేణి ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాంపుర్ వెళ్తుండగా ప్రియాంక కాన్వాయ్.. జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు వీరేందర్ చౌదరి కారును ఢీకొట్టింది. వెంటనే కాన్వాయ్‌లోని నాలుగు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కారు అద్దాన్ని తుడిచిన ప్రియాంక
ప్రమాదం తర్వాత.. మంచు కారణంగా దారి సరిగా కనిపించడం లేదని డ్రైవర్ కారు ఆపగా... ప్రియాంక కారు దిగి వస్త్రంతో అద్దాన్ని తుడిచారు.
ఇదీ చూడండి:బాలికపై హత్యాచారం- అడ్డొచ్చిన ఇద్దరు హత్య