తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్విట్టర్​లో శారీ ట్రెండ్​.. ప్రియాంక పెళ్లి చీర వైరల్​ - కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆమె పెళ్లినాటి ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్విట్టర్​లో ప్రస్తుతం శారీ ట్రెండ్ నడుస్తోంది. పలువురు మహిళలు తాము చీరకట్టులో ఉన్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

ట్విట్టర్​లో శారీ ట్రెండ్​.. ప్రియాంక పెళ్లి చీర వైరల్​

By

Published : Jul 18, 2019, 6:44 AM IST

ట్విట్టర్​లో తాజాగా చీరల ట్రెండ్​ వైరల్ అవుతోంది. చీరకట్టులో ఉన్న తమ ఫోటోలను మహిళలు... శారీ ట్విట్టర్ హ్యాష్​ ట్యాగ్​తో పంచుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఈ జాబితాలో చేరిపోయారు.

ట్విట్టర్​లో శారీ ట్రెండ్​.. ప్రియాంక పెళ్లి చీర వైరల్​

22 ఏళ్ల క్రితం తన వివాహం జరిగిన రోజున పూజ చేసే సమయంలో దిగిన ఫోటోను ఆమె పోస్టు చేశారు. లేత గులాబీ బంగారు వర్ణంలోని బెనారస్​ చీర కట్టుకొని ప్రియాంక సిగ్గుపడుతూ కూర్చుని ఉన్న ఈ ఫోటో.... పోస్టు చేసిన కొద్ది సేపటికే వైరల్ అయ్యింది.

పెళ్లిరోజు శుభాకాంక్షలు

ప్రియాంక ఫోటోలు వైరల్​ కావడం వల్ల ఆమెకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. అయితే తమ పెళ్లి రోజు ఫిబ్రవరిలో అని ఆమె స్పష్టం చేశారు.
"రాబర్ట్​ వాద్రా మీరు నన్ను విందు కోసం బయటకు తీసుకుని వెళ్లవచ్చు." అని మరో పోస్టు పెట్టారు.

ట్విట్టర్​లో శారీ ట్రెండ్​.. ప్రియాంక పెళ్లి చీర వైరల్​
ట్విట్టర్​లో శారీ ట్రెండ్​.. ప్రియాంక పెళ్లి చీర వైరల్​

ప్రేమకు పునాది..

ప్రియాంక పోస్టు వైరల్​ కావడంపై ఆమె భర్త రాబర్ట్​ వాద్రా స్పందించారు. 'ప్రేమ, ఆనందం, మద్దతు' మన బంధానికి పునాది అని ట్విట్టర్ వేదికగా తన భార్యపై ప్రేమను కురిపించారు.

ట్రెండ్​..

ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వనితల వరకూ శారీ ట్రెండ్​ కొనసాగుతోంది. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో మహిళలు తమ చీరకట్టుతో ఉన్న ఫోటోలు ఉంచుతున్నారు.

తారాతోరణం

కాంగ్రెస్ నేత నగ్మ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది, భాజపా నేత నూపుర్ శర్మ సైతం చీరకట్టులో ఉన్న తమ ఫోటోలను ట్విట్టర్​లో పోస్టు చేసి శారీ ట్విట్టర్ ట్రెండ్​ ఫాలో అవుతున్నారు.

ఇదీ చూడండి: కర్ణాటక విధాన సభలో నిలిచేదెవరో.. నేడే చూడండి

ABOUT THE AUTHOR

...view details