అయోధ్య రామమందిర భూమిపూజ భరతజాతి ఐక్యతకు, సౌభ్రాత్రానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.
"ఎన్నో తరాలుగా శ్రీరాముని వ్యక్తిత్వం భారత ఉపఖండం ఐక్యతకు రక్షరేకులా నిలిచింది. భారత ఉపఖండంతో పాటు ప్రపంచ నాగరికతపై రామాయణం తిరుగులేని ముద్ర వేసింది. శ్రీరాముడు అందరివాడు. ప్రతి ఒక్కరి సౌఖ్యాన్ని కోరుకున్నాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడిగా భాసిల్లుతున్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజ దేశఐక్యతను చాటడం సహా ఆ శ్రీరాముడు ఆశీర్వాదాల్ని, ఆయన లోకకల్యాణ సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది."