తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ధనికులకే చౌకీదార్:ప్రియాంక - చౌకీదార్

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రధాని 'చౌకీదార్' ప్రచారంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ చౌకీదార్​ (ప్రధాని) ధనవంతుల కోసమేనని ఎద్దేవా చేశారు.​ 3 రోజుల ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా గంగా యాత్రలో పాల్గొన్నారు ప్రియాంక.

మోదీ ధనికులకే చౌకీదార్:ప్రియాంక

By

Published : Mar 18, 2019, 7:13 PM IST

Updated : Mar 19, 2019, 8:03 PM IST

లోకసభ ఎన్నికల రణరంగానికి కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార శంఖారావం పూరించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ ఆచరిస్తున్న 'చౌకీదార్' ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రియాంక. ఈ 'చౌకీదార్'​ ధనవంతుల కోసమేనని, పేదల పక్షం కాదని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగంపైనా ప్రియాంక పదునైనా విమర్శలు చేశారు. ప్రస్తుతమున్న నిరుద్యోగం గతంలో ఎన్నడూ చూడలేదని ఆరోపించారు. నలుగురు, ఐదుగురు పెద్దల చేతిలోనే ప్రభుత్వం బందీ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బహిరంగ సభలో ప్రసంగిస్తోన్న ప్రియాంక గాంధీ

"ఈ ఎన్నికల్లో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ ఎన్నికలు మీ మంచి కోసమే కాదు..దేశం కోసం కూడా. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోంది..ఒక నలుగురు ఐదుగురు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మొత్తం సంస్థలను, వ్యవస్థలను నాశనం చేశారు. దేశాన్ని పాలించడం ఇలా కాదు. సర్కారు, దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నంత నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేదు. నా మాటలు మనసులో పెట్టుకోండి. ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని, మిమ్మల్ని శక్తిమంతం చేసుకోండి. వివేకంతో వ్యవహరించండి. ఈ దేశం మీది." - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

Last Updated : Mar 19, 2019, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details