తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చావనైనా చస్తా కానీ వారికి సాయం చేయను' - ఆర్​ఎల్​డీ

ఉత్తరప్రదేశ్​లో ఎస్పీ- బీఎస్పీ- ఆర్​ఎల్​డీ కూటమి విజయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్​- భాజపా కలిసి పనిచేస్తున్నాయన్న ఆరోపణలపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. తన దృష్టిలో భాజపాకు మద్దతివ్వడం కన్నా  చావడమే మేలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'చావనైనా చస్తా కానీ వారికి సాయం చేయను'

By

Published : May 2, 2019, 4:18 PM IST

Updated : May 2, 2019, 4:55 PM IST

తన దృష్టిలో భాజపాకు లబ్ధి చేకూర్చడం కన్నా చావడమే మంచి పని అని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాధీ వాద్రా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్​లో ఎస్పీ- బీఎస్పీ- ఆర్​ఎల్​డీ కూటమి విజయావకాశాలను దెబ్బతీయడానికి కాంగ్రెస్​- భాజపా కలిసి పనిచేస్తున్నాయన్న ఆరోపణలపై ప్రియాంక ఈ విధంగా స్పందించారు.

ప్రియాంక గాంధీ స్పందన

ప్రజాస్వామ్యాన్ని భాజపా అణచివేస్తోందని ఆరోపించిన ప్రియాంక... జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను సిద్ధాంతాల మధ్య పోరుగా అభివర్ణించారు. దేశ వ్యవస్థలపై దాడి చేస్తున్న సిద్ధాంతాన్ని నాశనం చేయడమే ప్రధాన ధ్యేయమన్నారు.

ఎన్నో నియోజకవర్గాల్లో భాజపాకు తమ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని ప్రియాంక అన్నారు.

అందుకే బరిలో దిగలేదు...

41 మంది అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను పార్టీ తనకు అప్పగించడం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. 2022 ఉత్తరప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు.

ఇదీ చూడండి:'ఉదయం 5 నుంచి పోలింగ్​ నిర్వహించలేరా?'

Last Updated : May 2, 2019, 4:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details