తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాల్ట్‌ స్టేషన్లపై నిర్ణయం ప్రైవేటు రైలు ఆపరేటర్లదే - Private trains latest news

ప్రైవేటు రైళ్లు ఏయే స్టేషన్లలో ఆగాలనే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఆపరేటర్లకే ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. స్టేషన్ల వివరాలను ముందుగానే రైల్వేకు తెలియజేయాలి. ఛార్జీలు నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఆపరేటర్లకే ఉంటుందని రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

Private train operators given freedom to choose halt stations: Railways
హాల్ట్‌ స్టేషన్లపై నిర్ణయం ప్రైవేటు రైలు ఆపరేటర్లదే

By

Published : Aug 17, 2020, 5:37 AM IST

దేశంలో ప్రైవేటు రైళ్లకు సంబంధించి మరిన్ని విధాన అంశాలను రైల్వే వెల్లడించింది. ఛార్జీలు నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఆపరేటర్లకే ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక అవి ఏయే స్టేషన్లలో ఆగాలో నిర్ణయించేది కూడా ప్రైవేటు ఆపరేటర్లేనని తాజాగా చెప్పింది.

అయితే ఆ స్టేషన్ల వివరాలను ముందుగానే రైల్వేకు తెలియజేయాలి. స్టేషన్ల వారీగా వచ్చే, వెళ్లే సమయాలు ముందుగా చెప్పాలి. కనీసం ఏడాది పాటు అదే షెడ్యూలు పాటించాలి.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంటర్నెట్​ సేవల పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details