దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో గురువారం కీలక సమావేశం నిర్వహించనుంది. టీకాకు సంబంధించిన కీలకాంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్... రాష్ట్రాల మంత్రులతో చర్చించనున్నారు.
జనవరి 8న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండో దశ డ్రైరన్ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.