కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్ని మరింత ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. దాతల నుంచి విరాళాలు సేకరించి, కష్టాల్లో ఉన్నవారికి అందించే సదుద్దేశంతో "ప్రైమ్ మినిస్టర్స్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్"(పీఎం కేర్స్) పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఇందుకు చిన్న మొత్తాల్లోనూ విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు ప్రధాని.
'పీఎం కేర్స్' నిధి ఏర్పాటు- కాసేపటికే వెల్లువెత్తిన విరాళాలు - Narendra Modi news 2020
కరోనాపై పోరాటంలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసేలా కీలక అడుగు వేసింది మోదీ సర్కార్. పీఎం కేర్స్ పేరిట ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు చేసింది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే రూ.21 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది ఐఏఎస్ అధికారుల సంఘం.
!['పీఎం కేర్స్' నిధి ఏర్పాటు- కాసేపటికే వెల్లువెత్తిన విరాళాలు Prime Minster Modi announces CARES fund for donations to India's war against Corona Virus 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6575491-503-6575491-1585396094863.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ
విరాళాల వెల్లువ
నిధి ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసిన కాసేపటికే ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించింది. తమ వంతుగా రూ.21 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా సభ్యులంతా కనీసం ఒక్క రోజు వేతనం ఇస్తారని తెలిపింది. పీఎం కేర్స్ నిధికి రూ.25 కోట్లు విరాళం ప్రకటించారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.