ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో సమావేశమయ్యారు. కరోనా కేసులపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, హర్షవర్దన్‌తో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50 వేల కంటే తక్కువగా నమోదవుతున్నా కొన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న చర్యలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, వీలైనంత త్వరగా, సమర్థంగా పంపిణీ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దేశంలో ఐదు వ్యాక్సిన్లు తుది దశకు చేరుకున్నాయి. అందులో నాలుగు రెండు, మూడు ప్రయోగ పరీక్షల దశల్లో ఉన్నాయి. ఒకటి ఒకటి రెండు ప్రయోగ పరీక్షల దశలో ఉంది.