తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం - మోదీ ప్రసంగం

prime-minister-narendra-modi-will-address-the-nation-at-4-pm-tomorrow-office-of-the-prime-minister-pmo
రేపు సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

By

Published : Jun 29, 2020, 10:28 PM IST

Updated : Jun 29, 2020, 11:08 PM IST

22:24 June 29

రేపు సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

మే నెల నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 15న గల్వాన్​ లోయలో భారత సైనికులపై చైనా దుస్సాహసానికి పాల్పడింది. ఈ ఘటనలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. వారి త్యాగాన్ని దేశం మరవబోదని ప్రధాని ఉద్ఘాటించారు. శత్రువులను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు భారత్​కు ఉన్నాయని చైనాను పరోక్షంగా హెచ్చరించారు మోదీ.

Last Updated : Jun 29, 2020, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details