దేశానికి డా.బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం రూపంలో ఒక గొప్ప బహుమతి ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. అంబేడ్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పార్లమెంటులోని ఆయన చిత్రపటానికి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పాత్రను గుర్తుచేసుకుంటూ మోదీ ట్వీట్ చేశారు.
రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు - అంబేడ్కర్ వర్ధంతికి ఉపరాష్ట్రపతి నివాళులు
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రత్యేకమని కీర్తించారు.

రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
"రాజ్యాంగం రూపంలో దేశానికి బాబాసాహెబ్ అపురూపమైన బహుమతి ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యానికి ఆ రాజ్యాంగమే మూలాధారం. ఆయనకు ఈ దేశం ఎల్లప్పటికీ రుణపడి ఉంటుంది." - ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్.
ఈ సందర్భంగా ట్విట్టర్లో అంబేడ్కర్‌పై ఓ వీడియోను షేర్ చేశారు మోదీ.
Last Updated : Dec 6, 2019, 10:42 AM IST