పారికర్ పార్థివదేహానికి నివాళులర్పించారు మోదీ పనాజీలోని కలా అకాడమీలో గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పారికర్ కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం ప్రకటించారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు సైతం...
రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గోవా గవర్నర్ మృదులా సిన్హా కలా అకాడమీకి చేరుకుని పారికర్‌కు నివాళులర్పించారు. పారికర్ పార్థివదేహాన్ని చూసిన స్మృతి ఇరానీ కన్నీటి పర్వంతమయ్యారు. పారికర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేబినెట్ సమావేశానంతరం గోవాకు
సోమవారం ఉదయం దిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమై పారికర్‌కు నివాళులర్పించింది. సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపింది. అనంతరం మోదీ గోవా బయలుదేరారు.