స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిల్లీలోని రాజ్ ఘాట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
దిల్లీ రాజ్‌ఘాట్ వేదికగా రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని
ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన ఓ వీడియోను మోదీ తిలకించారు.
2017 ఏప్రిల్ 10న చంపారన్ సత్యాగ్రహా శత వేడుకలను పురస్కరించుకుని గాంధీకి నివాళి అర్పిస్తూ రాష్ట్రీయ స్వచ్ఛ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.