మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ ఆవిష్కరించిన 'వైష్ణవ జన తో' గీతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈటీవీ భారత్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. బాపూజీ కలల సాకారానికి అనుగుణంగా... స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని ట్వీట్ చేశారు.
"పూజ్యులైన బాపూను స్మరిస్తూ అద్భుతమైన భజన గీతాన్ని స్తుతించినందుకు ఈటీవీ భారత్కు హార్దిక అభినందనలు. గాంధీ కలలు సాకారం అవ్వడానికి, స్వచ్ఛభారత నిర్మాణానికి మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి భారత్కు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది."