తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​పై మోదీతో సీఎంలు ఏమన్నారంటే...

కరోనా మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సమతుల వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంభాషించారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆరుగంటల పాటు లాక్​డౌన్​ తదితర అంశాలపై చర్చలు జరిపారు.

Prime Minister Narendra Modi has said that a balanced strategy needs to be devised to overcome the challenges facing the corona epidemic. Communication with Chief Ministers of all states today in a video conference.
మోదీ వీసీ: లాక్​డౌన్​పై ముఖ్యమంత్రులు ఏమన్నారంటే!

By

Published : May 11, 2020, 10:47 PM IST

Updated : May 12, 2020, 11:34 AM IST

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి సమతుల వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే.. దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామని అన్నారు.

గ్రామాల్లోకి కరోనాకు నో ఎంట్రీ!

కరోనా మహ్మమారి నుంచి భారత్‌.. తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందన్న ప్రధాని.. ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఎక్కడైతే భౌతిక దూరం నియమాలు పాటించలేదో... ఆయా చోట్ల మనకు సమస్యలు పెరిగాయని ప్రధాని అన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపులిచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతిపెద్ద సవాలని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఆరు గంటల పాటు సమావేశం

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుమారు ఆరుగంటల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఏప్రిల్‌ 27న జరిగిన సమావేశంలో అనేక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించే అవకాశం లభించలేదని కొందరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి 9.30గంటల వరకూ ఈ సమావేశం జరిగింది. సమావేశానికి సాయంత్రం ఆరు గంటల సమయంలో 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై సీఎంలు ఏమన్నారు!

కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని నరేంద్రమోదీని కోరాయి. లాక్‌డౌన్‌ పొడిగించమని కోరిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణలు ఉన్నాయని సమాచారం.

"ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదు. దానితో కలిసి బతకడం తప్పదు"

-కేసీఆర్‌,తెలంగాణ ముఖ్యమంత్రి.

"లాక్‌డౌన్‌ సడలింపులు, కంటైన్మెంట్‌ వ్యూహాలపై పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. కంటైన్‌మెంట్‌ కారణంగా ఆర్థిక లావాదేవీలకు ఇబ్బంది నెలకొంది. దీనిలో మార్పులు చేయాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో క్లినిక్‌లను బలోపేతం చేసుకోవాలి"

-జగన్ ‌మోహన్‌రెడ్డి, ఏపీ సీఎం

"బిహార్‌లో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగిస్తాం. ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బిహార్‌కు వస్తారు. అప్పుడు కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది"

-నితీష్ కుమార్‌, బిహార్‌ ముఖ్యమంత్రి.

"మా రాష్ట్రానికి అత్యవసరంగా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్ల‌ు కావాలి. అదే విధంగా రాష్ట్రానికి రూ.3వేల కోట్ల విలువైన మెడికల్‌ పరికరాలు కావాలి. వలస కూలీలను తరలించేందుకు మరో రూ.2,500కోట్లు అవసరం ఉంది. మే 31 వరకూ చెన్నైకు రైళ్లు, విమాన రాకపోకలు అనుమతించవద్దు."

- పళని స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి

"దేశంలో సమాఖ్య వ్యవస్థకు గౌరవం ఇవ్వండి. అమిత్‌ షా, ఇతర అధికారులు రాసిన లేఖలు బంగాల్ ప్రభుత్వానికి అందకముందే మీడియా చేరుతున్నాయి. ఇది గర్హనీయం. బంగాల్‌లో రాజకీయాలు చేయడం ఆపండి. కరోనాపై రాష్ట్రం పోరాడుతున్న ఈ సమయంలో కేంద్రం రాజకీయాలు చేయడం తగదు."

- మమతా బెనర్జీ, బంగాల్‌ సీఎం.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగించాలి. అయితే రాష్ట్రాలకు ఆర్థికంగా చేయూతనందించాలి. ప్రజల ప్రాణాలతో పాటు జీవనోపాధిని కాపాడుకునేలా లాక్​డౌన్​ ఎత్తివేతకు కచ్చితమైన ప్రణాళిక​ సిద్ధం చేసుకోవాలి."

-- అమరీందర్​ సింగ్​, పంజాబ్​ ముఖ్యమంత్రి

" అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించాలి. కంటైన్​మెంట్​ జోన్లలో మాత్రమే కఠిన నిబంధనలు విధించాలి"

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

"లాక్​డౌన్​పై కచ్చితమైన నిర్ణయం తెలియజేయాలి. రాష్ట్రాలు వాటిని అమలు చేయాలి. ముంబయిలో పనిచేస్తున్న అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది రాకపోకల కోసం కొన్ని లోకల్​ ట్రైన్లను పునరద్ధరించాలి"

- ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

"లాక్​డౌన్​ క్రమంలో ఉపాధి హామీ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోనూ ఉద్యోగ భద్రత కల్పించాలి."

అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి

"పంచాయితీలను సైతం కోవిడ్​పై పోరులో భాగం చేయాలి. ఇది సుదీర్ఘకాలం సాగే యుద్ధం. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వికేంద్రీకరణ విధానం అవసరం."

నవీన్​ పట్నాయక్​, ఒడిశా ముఖ్యమంత్రి

కొంతమంది ముఖ్యమంత్రులు జోన్ల వర్గీకరణపైనా ప్రశ్నలు లేవనెత్తారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా రెడ్​, ఆరెంజ్​, గ్రీన్​ జోన్ల వర్గీకరించుకునేలా రాష్ట్రాలకు అధికారాలివ్వాలని కోరారు.

లాక్​డౌన్​ సడలింపుల తర్వాత చైనా, జర్మనీ, దక్షిణ కొరియాలో మళ్లీ కేసులు రావడంపైనా చర్చించారు నేతలు. భారత్​లో సడలింపుల ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపై సందిగ్ధం వ్యక్తం చేశారు.

Last Updated : May 12, 2020, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details