'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష - Prime Minister Narendra Modi has chaired a high-level meeting to review the ongoing efforts to contain COVID-19.

'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష
17:47 March 19
'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష
'కరోనా'పై ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.
కరోనా నియంత్రణకు ఇకపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, నిపుణులు సమాలోచనలు జరపాలని నిర్దేశించారు మోదీ. కరోనాపై పోరులో భాగస్వాములైన రాష్ట్రప్రభుత్వాలు, వైద్య సిబ్బంది, సాయుధ, పారామిలటరీ దళాలు, విమానయాన సిబ్బంది, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.
Last Updated : Mar 19, 2020, 6:12 PM IST