జమ్ముకశ్మీర్లో భాజపా నేత వసీంబరి కుటుంబంపై ఉగ్రదాడి, హత్య ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. దాడికి సంబంధించి వివరాలను ఆరా తీసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. వసీంబరి కుటుంబానికి మోదీ సానుభూతి ప్రకటించినట్లు తెలిపింది.
పార్టీకి తీరని నష్టం..
వసీంబరి మృతి భాజపాకు తీరని నష్టమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వసీంబరి, ఆయన తండ్రి, సోదరుడి త్యాగాలను వృథా పోనియమని హామీ ఇచ్చారు.
"జమ్ముకశ్మీర్లో జరిగిన క్రూరమైన దాడిలో వసీంబరి, అతని తండ్రి, సోదరుడిని కోల్పోయాం. పార్టీకి ఇది తీరని నష్టం. వసీం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన కుటుంబానికి భాజపా అండగా నిలుస్తుంది. వసీం త్యాగం వృథా కానివ్వం."